బస్సు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ATP: మడకశిర మండల పరిధిలోని ఎల్లోటి గ్రామ సమీపంలో ఎల్లోటి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు హైవేను క్రాస్ చేస్తుండగా కర్ణాటక ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు.