పింఛన్ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి
ASR: హుకుంపేట(M) దబ్బాగరువుకు చెందిన 1వ తరగతి విద్యార్థిని పాంగి దేవికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పుట్టుకతో రెండు కాళ్లు రాక వీల్‌చైర్‌పై సోదరుడి సహాయంతో పాఠశాలకు వెళ్తోంది. ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని కోరుతున్నారు.