బాన్సువాడ బస్టాండ్‌కు మహర్దశ.. మంత్రి హామీ

బాన్సువాడ బస్టాండ్‌కు మహర్దశ.. మంత్రి హామీ

KMR: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఆధునీకరణపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మంత్రిని కలిసి బస్టాండ్‌ దుస్థితిని వివరించారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్‌ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు.