నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

PLND: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ రమ్య, విజయ్ నాయక్ పిలుపునిచ్చారు. కారంపూడి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 12వ తేదీన జరిగే కార్యక్రమంలో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు మందులు వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు.