10 రోజులుగా పనిచేయని BSNL నెట్‌వర్క్

10 రోజులుగా పనిచేయని BSNL నెట్‌వర్క్

KDP: కొండాపురం గ్రామంలో 10 రోజుల నుంచి BSNL టవర్ పనిచేయడం లేదు. చుట్టు పక్కల గ్రామాలలో ఉన్న వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులకు అర్జీ రూపంలో తెలియజేసినా ఫలితం లేదని వినియోగదారులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నెట్‌వర్క్ సమస్యలు రాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.