ట్రంప్ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు
చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా పెట్టిన గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ జూన్ కాంట్రాక్ట్ 110.58 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ మే కాంట్రాక్ట్ 111.90 డాలర్లకు ఎగబాకింది.