ACBకి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి

ACBకి పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి

VSP: విశాఖ నగరంలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. గాజువాక 74వ వార్డు నెహ్రూ నగర్ సచివాలయంలో పరిపాలనా కార్యదర్శిగా పనిచేస్తున్న గణేష్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.16 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సచివాలయ వ్యవస్థలో అవినీతి పెరుగుతోందన్న ఆరోపణలకు ఈ ఘటన మరో ఉదాహరణగా మారింది.