'బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనాలు'
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించనున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభకు జిల్లా నలుమూలల నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.