నూతన పాలకవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే వీరేశం

నూతన పాలకవర్గాన్ని సత్కరించిన ఎమ్మెల్యే వీరేశం

NLG: చిట్యాల మండలంలో జరిగిన నేరడ గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకున్న అభ్యర్థులు మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలతో పాటు 8 మంది వార్డు మెంబర్లుగా కాంగ్రెస్, సీపీఎం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి శాలువాతో సత్కరించారు.