ఇబ్రహీంపట్నంలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
RR: ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో ETF- 2 బృందం దాడి చేసి సుమారు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. పాత రైస్ మిల్ వద్ద రెండు వాహనాల్లో బియ్యం నిల్వ, తరలింపు జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక వాహనంలో 35 క్వింటాళ్లు లోడ్ కాగా, మరో వాహనం అన్‌లోడ్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.