రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
అన్నమయ్య: కోడూరు నియోజకవర్గం గుండాలపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వివి కండ్రికకు చెందిన శివానంద్ (29) అనే యువకుడు మృతి చెందాడు. పెంచలయ్య అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న వీరిని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.