జడ్చర్లలో ప్రమాదకరంగా రోడ్డు గుంతలు
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని నేతాజీ చౌరస్తా వద్ద రోడ్డు మధ్యలో గుంత ఏర్పడి ప్రమాదకరంగా ఉంది. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌కు వెళ్లే రహదారి గుంతల మయంగా మారి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.