సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక

అనంతపురం: కళ్యాణదుర్గం మండలం దోడగట్ట గ్రామంలో 10 కుటుంబాలు సోమవారం స్వచ్ఛందంగా వచ్చి కళ్యాణదుర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతు తెలిపారు. మీ విజయం కోసం మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారికి సురేంద్రబాబు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు.