నేటి నుంచి మండలంలో ఆధార్ క్యాంపులు: ఎంపీడీవో

కోనసీమ: అల్లవరం మండలంలో సోమవారం నుంచి 15వ తేదీ గురువారం వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని MPDO కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. మండలంలోని ప్రతి సచివాలయంలో ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో 0-6 ఏళ్ల పిల్లల ఆధార్ నమోదు, ఆధార్ బయో మెట్రిక్ అప్‌డేట్, ఆధార్ సమాచారంలో తప్పులు సవరణ వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.