రాహదారి గుంతలు పూడ్చిన యువకుడు

రాహదారి గుంతలు పూడ్చిన యువకుడు

ADB: భోరజ్ మండలం బాలాపూర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ భూములకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి, బురదమయంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన యువకుడు కడిసే ప్రశాంత్ వెంటనే స్పందించారు. నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తెప్పించి, తన సొంత ఖర్చుతో గుంతలను పూడ్చి రోడ్డును చదును చేశారు.