రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
SKLM: సోంపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ జీ. యజ్ఞేశ్వరరావు పేర్కొన్నారు. సోంపేట మండలం సోంపేట, బెంకిలి, జింకిభద్ర పంచాయతీలు, కవిటి మండలం నెలవంక, సీమూరు, వడ్డిజల్లుపుట్టుగ, బైరెడ్లపుట్టుగ, మధ్యపుట్టుగ, కొమ్మపుట్టుగ గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.