లండన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు

లండన్‌లో భారీ నిరసన ప్రదర్శనలు

లండన్‌లో అక్రమ వలసదారులను పంపించేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు భారీగా నిరసన చేపట్టారు. ఇంగ్లండ్, బ్రిటన్ జెండాలతో పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 26 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు నిరసనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.