బీజేపీ ఎంపీకి పరోక్షంగా కనిమొళి చురకలు

బీజేపీ ఎంపీకి పరోక్షంగా కనిమొళి చురకలు

మొదటి అంతరిక్ష యాత్రకుడు హనుమాన్ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అనడంపై డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా చురకలంటించారు. అదృష్టవశాత్తూ అలాంటి నాయకులు తమిళనాడులో నాయకత్వ స్థానంలో లేరని తెలిపారు. ప్రాచీన కాలంలో తమిళులు ఎన్నో యుద్ధాలను గెలిచారని అయినప్పటికీ అక్కడి ప్రజలను, వారి సంస్కృతిని నాశనం చేయలేదన్నారు. తమిళులకు ఆధిపత్యం చేయాలనే ఆలోచనే ఉండదని చెప్పుకొచ్చారు.