శాశ్వత గ్రంథాలయం నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
HNK: కాజీపేటలో శాశ్వత గ్రంథాలయం నిర్మించాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ వినతిపత్రం అందజేశారు. పాత మున్సిపాలిటీ కార్యాలయ స్థలంలో ఆధునిక సదుపాయాలతో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పాఠకులకు అన్ని ఏర్పాట్లు కల్పించాలని ఎమ్మెల్యేను కోరినట్లు కార్పొరేటర్ తెలిపారు.