డ్రైనేజీ లైన్స్ పూర్తిగా శుభ్రం చేయాలి

KMM: ఖమ్మం 31, 32వ డివిజన్‌లలో సోమవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. ఆయా డివిజన్‌ల సానిటరీ ఇన్స్‌పెక్టర్ జవాన్ లకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా కాలువలు మూసుకుపోకుండా ఉండేలా మ్యాన్‌హోల్స్, డ్రైనేజీ లైన్స్‌ను పూర్తిగా శుభ్రం చేయాలని, రోడ్ల పక్కన, కాలువల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు.