'వ్యక్తిగతంగా విమర్శించడం సిగ్గుచేటు'

RR: కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నటరాజన్ అన్నారు. షాద్ నగర్ BRS కార్యాలయంలో మాట్లాడుతూ.. BRS హయాంలో జరిగిన అభివృద్ధిపై మేము వివరాలు చెప్తే.. ఆ వివరాలపై మాట్లాడకుండా రాజకీయ బిచ్చగాళ్లు అని నోరు పారేసుకోవడం సమంజసం కాదని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ తమ ఉనికిని ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.