VIDEO: ప్రమాదాలకు నిలయంగా మారిన ఓడలరేవు బీచ్
కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో స్నానానికి దిగి యువకులు మృత్యువాత పడుతున్న సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. సముద్రంలో కెరటాల ఒత్తిడి , అధిక లోతును పట్టించుకోకుండా యువకులు స్నానాలకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండేళ్లలో సుమారు 8 మంది వరకు మృతి చెందారు. తాజాగా అమలాపురం నారాయణపేటకు చెందిన లోకేశ్(16) బీచ్‌లో స్నానానికి దిగి గల్లంతయ్యాడు.