ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు: ఎస్పీ

MDK: మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని వాగులు పొంగు పొర్లుతున్నాయని ప్రజలెవరు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు సూచించారు. అటు బుధవారం హవెళి ఘనపూర్–ఎల్లారెడ్డి రహదారిలో నక్కవాగు ఉధృత ప్రవాహానికి కారు కొట్టుకుపోయిన ఘటనను ఆయన పరిశీలించారు. SDRF/NDRF ద్వారా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.