వీర జవాన్‌కు పాఠశాల సిబ్బంది అశ్రునివాళి

సత్యసాయి: గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఈ సందర్భంగా వీర జవాన్ మురళీ నాయక్‌కు శనివారం విజ్ఞాన్ పాఠశాలలో నివాళులర్పించారు. పాఠశాల హెచ్ఎం క్రిష్ణవేణి మాట్లాడుతూ.. మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.