గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ప్రకాశం: ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయ కానిస్టేబుల్ కందుల రాఘవరావు చనిపోయారు. సెంట్రీ డ్యూటీలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చి కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన ఒంగోలుకు తరలించారు. ఐదు నెలల క్రితం ఆత్మకూరుకు బదిలీపై వచ్చారు. ఆఫీసులోనే చనిపోవడంతో సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు.