PNG కనెక్షన్ తీసుకుంటే రూ.2400 సబ్సిడీ: జేసీ
E.G: PNG వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. LPG వదిలి PNG కనెక్షన్ తీసుకునే అర్హులకు ఏడాదికి రూ.2400 సబ్సిడీని ఆరు వాయిదాల్లో డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సురక్షితమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని వివరించారు.