VIDEO: శివాజీ జయంతి.. ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు
MHBD: పెద్ద వంగర మండలం ఔతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. పాఠశాల గురువులు శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సెల్ఫీ పాయింట్ వద్దకు చేరుకుని శివాజీ మహారాజ్‌కు జై పలకుతూ వందనాలు సమర్పించారు. ప్రధానాచార్యులు కళాధర్ తదితరులు పాల్గొన్నారు.