JEE నకిలీ హాల్ టికెట్లు.. నిందితుడు అరెస్ట్

JEE నకిలీ హాల్ టికెట్లు.. నిందితుడు అరెస్ట్

GNTR: జిల్లా కేంద్రంలోని చంద్రామౌళినగర్‌లో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని నకిలీ హాల్ టికెట్లు ఇచ్చి మోసం చేసిన కేసులో పట్టాభిపురం పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో మోసం బయటపడింది. నిందితున్ని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కోర్టుకు అప్పగించగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.