సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి రజిని

GNTR: పట్టణంలోని శ్యామలనగర్ సంతోషిమాత ఆలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కిలారు రోశయ్య, వడ్లమాను రవి తదితరులు పాల్గొన్నారు.