VIDEO: భావనారాయణ స్వామి పాత రథం తరలింపు
BPT: బాపట్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భావనారాయణ స్వామి ఆలయం వద్ద ఉన్న పాత రథాన్ని అధికారులు తరలించారు. సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న తూర్పు సత్రం వద్దకు దీనిని మార్చారు. భారీ క్రేన్ సహాయంతో ఈ రథాన్ని అత్యంత జాగ్రత్తగా అక్కడికి చేర్చారు. తరలింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.