మంబోజిపల్లి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
MDK: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంబోజిపల్లి చెక్‌పోస్ట్‌ను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీల రిజిస్టర్ను పరిశీలించి, సిబ్బంది వాహన తనిఖీలు చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా గమనించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.