ఐలమ్మకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నివాళులు

ఐలమ్మకు అఖిలపక్షం ఆధ్వర్యంలో నివాళులు

SDPT: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా అక్కన్నపేటలో అఖిలపక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గంపల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవం, ధైర్యం, పోరాట స్ఫూర్తికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.