కళ్యాణ రామచంద్ర స్వామికి చక్ర స్నానం

కళ్యాణ రామచంద్ర స్వామికి చక్ర స్నానం

MDK: రామాయంపేట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని నిర్వహించిన 22వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారికి ఘటాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి విశేష పూజలు చేశారు.