పోలీసుల జోక్యం పై న్యాయవాదుల నిరసన

పోలీసుల జోక్యం పై న్యాయవాదుల నిరసన

అన్నమయ్య: హిందూపురం న్యాయవాది అబ్దుల్ రహీమ్‌ను సివిల్ కేసులో జోక్యం వద్దు అని చెప్పినందుకు సర్కిల్ CI దుర్భాషలాడి స్టేషన్ నుంచి గెంటివేసిన ఘటనపై రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.పోలీసుల జోక్యం పెరుగుతోందని,కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగానికి భంగం అని న్యాయవాదులు తెలిపారు.