పెనుగొండ డివిజన్‌లో వర్షపాతం వివరాలు
సత్యసాయి: పెనుగొండ రెవిన్యూ డివిజన్‌లో ఆదివారం రాత్రి 360.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాలో రొద్దం–88.6, ఆగలి–58.6, మడకశిర–56.8, రొళ్ల–50, పెనుగొండ–51.4, గుడిబండ–14.4, పరిగి–14.2, అమరాపురం–10.2, సోమందేపల్లి–7.0, లేపాక్షి–7.0 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు.