మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

VZM: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో గజపతినగరం ఐసీడీఎస్ సీడీపీవో నాగమణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో అవగాహన పెంపొందించుకుని ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి, ఎంఈవో విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.