'అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించాలి'
MLG: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఇవాళ ఆరోగ్య కార్యకర్తలకు “అధిక ప్రమాద గర్భధారణ నిర్వహణ”పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO డా. గోపాల్ రావు మాట్లాడుతూ.. అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి సరైన వైద్య సేవలు అందిస్తే మాతృ-శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు పలు సూచనలు అందించారు.