నూతన ESI ఆసుపత్రి భవన నిర్మాణానికి చర్యలు
ASF: కాగజ్ నగర్ ESI ఆసుపత్రి శిథిలావస్థపై MLA హరీష్ బాబు చర్యలు తీసుకోవడంతో విషయం రాష్ట్ర ప్రభుత్వం, ESI కమిషనర్ దృష్టికి వెళ్లి పునర్నిర్మాణానికి ఆమోదం లభించింది. ప్రస్తుతం ఆసుపత్రిని అద్దె భవనానికి మార్చిన తర్వాత కొత్త భవన నిర్మాణం వేగవంతంగా ప్రారంభించనున్నట్లు MLA మంగళవారం తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చేస్తున్నామన్నారు.