మదనపల్లెలో ఆసుపత్రి గుర్తింపు రద్దు
అన్నమయ్య: మదనపల్లె ఎస్‌బీఐ కాలనీలోని ఓ ఆసుపత్రి గుర్తింపును శుక్రవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రద్దు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు,DMHO డా.లక్ష్మీ నరసయ్య సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నోటీసులు ఏర్పాటు చేశారు. ఇకపై ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సేవలు అనుమతించబోమని స్పష్టంగా పేర్కొంటూ అధికారులు బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేశారు.