ఎమ్మెల్యే రేవూరి నేడు ప్రజలకు అందుబాటులో ఉండరు

HNK: పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం విజిటర్స్‌కి అందుబాటులో ఉండరని ఆయన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. నియోజకవర్గం ప్రజలు విషయాన్ని గమనించి ఆయనను కలిసేందుకు క్యాంప్ కార్యాలయానికి గాని, నివాసానికి గాని రావద్దని కోరారు.