జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్

ADB: జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలో సిలిండర్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. సందేహాల నివృత్తి కోసం 18004251939ను సంప్రదించాలని కోరారు.