దేవాలయంలో దొంగతనం, నగదు అపహరణ
NRPT: నర్వ మండల కేంద్రంలోని ఓ దేవాలయంలో దొంగతనం జరిగింది. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి హుండీలోని సుమారు రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం పూజారి సిద్దయ్య గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రమేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దొంగల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.