యూరియా కొరత నివారణకు స్పీకర్ దృష్టి

యూరియా కొరత నివారణకు స్పీకర్ దృష్టి

AKP: నర్సీపట్నం నియోజకవర్గంలో యూరియా కొరత తీర్చేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో యూరియా కొరత ఉందని రైతులు స్పీకర్ దృష్టికి తీసుకురావడంతో గురువారం స్పీకర్ స్వయంగా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖాధికారులతో యూరియా కొరతపై మాట్లాడారు. జిల్లాలో యూరియా కొరతను తీర్చాలని సూచించారు.