పొలాస రిపోర్ట్.. మండనున్న ఉత్తర తెలంగాణ

పొలాస రిపోర్ట్.. మండనున్న ఉత్తర తెలంగాణ

జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (AMFU), పొలాస ఉత్తర తెలంగాణకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ 15–19 మధ్య ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 45°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.