కల్వర్ట్ కూలడంతో నిలిచిపోయిన రాకపోకలు

కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. రాజమ్మ తండా వద్ద ఉన్న కల్వర్ట్ సోమవారం సాయంత్రం కూలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామస్థులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడమే కాకుండా, ముందు జాగ్రత్తగా రోడ్డు మూసివేత హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు