VIDEO: విద్యార్థులచే వంట పాత్రలు మోయించిన ఉపాధ్యాయులు

VIDEO: విద్యార్థులచే వంట పాత్రలు మోయించిన ఉపాధ్యాయులు

కోనసీమ: మలికిపురం మండలం బట్టేలంకలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత వంట పాత్రలు మోయించిన ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో మూడు రోజులపాటు జరిగే క్రీడా ఉత్సవాలకు భోజనం ఏర్పాట్లు చేయుటకు ఉపాధ్యాయులు పిల్లల చేత ఈ పనులు చేయించడంతో దానికి సంబంధించిన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.