విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: ఎంఈఓ

విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: ఎంఈఓ

SRPT: విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. శనివారం పాఠశాలలో గ్రీన్ డే నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం విద్యార్థులు ఆకుపచ్చ రంగు గలిగిన ఫలాలు, పూలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్ఎం మార్కండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.