బస్సు ప్రమాదానికి అదీ ఒక కారణమే: పొన్నం
TG: చేవెళ్లలో బస్సు ప్రమాదం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ.. ఇరుకు రోడ్డు ప్రమాదానికి ఒక కారణం. లారీలు, ఇసుక, డస్టును తరలిస్తే.. టార్పాలిన్లు కప్పి ఉంచాలి. వాణిజ్య, సరుకు రవాణా, ప్రయాణికుల వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలి' అని అధికారులకు సూచించారు.