ఉపాధి హామీ కొత్త సాఫ్ట్ వేర్ పై అవగాహన

ఉపాధి హామీ కొత్త సాఫ్ట్ వేర్ పై అవగాహన

NGKL: అమ్రాబాద్ మండలం మాచవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను బుధవారం టీఏ పారిజాతం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎన్ఎంఎస్ (NMMS) యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియను ఆమె పర్యవేక్షించారు. సాఫ్ట్‌ వేర్ నిబంధనల ప్రకారం.. పనుల వద్ద మొదటి ఫోటో అప్‌ లోడ్ చేసిన 4 గంటల తర్వాతే రెండో ఫోటో తీయాలని, అప్పుడే హాజరు ఖరారవుతుందని కూలీలకు వివరించారు.