నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం: మధిరలోని టీవీఎం ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయిలో జవహర్ నవోదయ విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు నిర్వహించబోయే పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ పరీక్షకు ఇంగ్లీష్ మీడియం నుంచి 138 మంది, తెలుగు మీడియం నుంచి 30 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.